ప్రముఖ తెలుగు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తన అనుమతి లేకుండా తన పేరు, ఫోటోలను అనధికారికంగా ఉపయోగిస్తున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, ఈ-కామర్స్ సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిత్వ హక్కులు (Personality Rights) ఉల్లంఘించబడుతున్నాయని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఎన్టీఆర్ పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు, జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని స్పష్టంగా పేర్కొంది. ఆయన ఫిర్యాదులపై సోషల్ మీడియా, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
కోర్టు ఆదేశాల ప్రకారం, జూనియర్ ఎన్టీఆర్ ఫిర్యాదులపై ఐటీ రూల్స్ 2021 కింద మూడు రోజుల్లో తగిన చర్యలు తీసుకోవాలి. ఈ కేసులో తదుపరి విచారణను, సవివరమైన ఆదేశాల కోసం డిసెంబర్ 22కు వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా పేర్కొన్నారు.








