Search
Close this search box.

  యాంకర్ సిండికేట్ వివాదంపై సుమ తెలివైన స్పందన

సీనియర్ యాంకర్ ఉదయభాను ఇటీవల టాలీవుడ్‌లో యాంకర్ల సిండికేట్ ఉందని వ్యాఖ్యానించడంపై పెద్ద దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు ప్రధానంగా స్టార్ యాంకర్ సుమ కనకాలను ఉద్దేశించే చేశారనే కామెంట్లు వినిపించాయి. ఈ విషయంపై సుమ పరోక్షంగా స్పందిస్తూ, తనదైన శైలిలో చాలా తెలివిగా సమాధానం ఇచ్చారు. సినిమా ఈవెంట్‌లకు హోస్ట్‌ను ఎంపిక చేసేది ప్రొడక్షన్ హౌస్, డైరెక్టర్లేనని, వారికి కావాల్సిన కంటెంట్‌ను బట్టి వారు సెలెక్ట్ చేసుకుంటారని సుమ తెలిపారు. ఒకప్పుడు యాంకర్ అంటే వాల్యూ ఉండేది కాదని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని, తన స్థిరత్వానికి కారణం నన్ను నేను అప్‌డేట్ చేసుకోవడం మాత్రమేనని సుమ వివరించారు.

తాను ఇన్నేళ్లు లాంగ్ జర్నీ చేయడానికి తన స్థిరత్వమే కారణమని సుమ స్పష్టం చేశారు. ఆడియన్స్‌ని ఎలా ఎంటర్‌టైన్ చేయాలనే ఆలోచిస్తూ, ప్రతి ఈవెంట్‌కు ముందుగానే ప్రిపేర్ అవుతానని, స్క్రిప్ట్ కూడా తానే రాసుకుంటానని సుమ తెలిపారు. గెస్ట్‌లు, కంటెంట్ వైరల్ అంశాలు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు వంటి విషయాలన్నింటినీ ప్లాన్ చేసుకుంటానని చెప్పారు. యాంకర్ల సిండికేట్ ఉందనే వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా, “ఇంతకుముందు మనకి ఛానల్స్ ద్వారా మాత్రమే షోలు వచ్చేవి. కానీ ఇప్పుడు నీకే సొంత ఛానల్స్ ఉన్నాయి. అలాంటప్పుడు నిన్ను ఎవరు ఆపుతారు… నిన్ను నువ్వు మాత్రమే ఆపుకోగలవు” అంటూ సలహా ఇచ్చారు.

సక్సెస్‌పై సుమ మాట్లాడుతూ, “నీ వృత్తిలో నువ్వు సక్సెస్ అయ్యావా? లేదా? అన్నది ఎలా తెలుస్తుంది అంటే… ఉదయం నువ్వు లేవగానే ‘ఏయ్ ఐ వాట్ టూ గో’ అనే ఉత్సాహం నీలో ఉంటే సక్సెస్ వచ్చేసినట్టే” అని అన్నారు. డబ్బు కోసం పరుగెత్తకుండా, నీ ప్యాషన్‌ని నువ్వు ఫాలో అయితే, మనీ నిన్ను ఫాలో అవుతుందని సుమ కనకాల తన సక్సెస్ సీక్రెట్‌ను వివరించారు.

 

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు