Search
Close this search box.

  సుజీత్ డైరెక్షన్‌లో సచిన్ టెండూల్కర్: వైరల్ అవుతున్న ఫొటోలు

‘ఓజీ’ (OG – ‘ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్’) సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్, తాజాగా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌ను డైరెక్ట్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘ఓజీ’ సినిమా మొదటి రోజు రూ. 154 కోట్లు వసూలు చేసి, లాంగ్ రన్‌లో ఏకంగా రూ. 330 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించింది. ఈ భారీ విజయానంతరం, సుజీత్ ఒక సినిమా స్టార్‌ను కాకుండా, క్రికెట్ స్టార్‌ను డైరెక్ట్ చేయడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

రీసెంట్‌గా జరిగిన ఒక యాడ్ షూట్ కోసం సుజీత్, సచిన్ టెండూల్కర్‌ను డైరెక్ట్ చేశారు. ఈ యాడ్ షూట్ సందర్భంగా, సచిన్‌కు సీన్ వివరిస్తున్న ఫొటోలను సుజీత్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలకు ఆయన, “మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌తో అద్భుతమైన క్షణాలు” అనే క్యాప్షన్‌ ఇచ్చారు. సచిన్ టెండూల్కర్, సుజీత్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ అరుదైన కలయికను చూసిన అభిమానులు సుజీత్‌ను ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక సుజీత్ సినీ ప్రాజెక్టుల విషయానికి వస్తే, ‘ఓజీ’తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఈ దర్శకుడు తదుపరి సినిమాను నేచురల్ స్టార్ నానితో ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది. ఈ సినిమాకు ‘బ్లడీ రోమియో’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాని ‘త ప్యారడైజ్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండగా, అది పూర్తయిన వెంటనే సుజీత్ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఈ చిత్రానికి కూడా తమన్ సంగీతం అందించనున్నాడు.

 

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు