టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి సన్నిహితంగా ఉన్న ఒక ఫొటోను ఆమె పంచుకోవడంతో, వీరిద్దరి మధ్య ఉన్న బంధంపై మరోసారి ఊహాగానాలు, చర్చలు మొదలయ్యాయి. గత కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఈ తాజా చిత్రం ఆ చర్చలకు మరింత ఊతమిచ్చింది. ఈ ఫొటోలో సమంత రాజ్ నిడిమోరును ఆలింగనం (Hug) చేసుకుని ఉండటం గమనార్హం.
ఈ ఫొటోకు సమంత జత చేసిన క్యాప్షన్‌లో “స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నాను” అని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఆమె తన కెరీర్ ప్రయాణం గురించి సుదీర్ఘమైన నోట్‌ను రాశారు. “గత ఏడాదిన్నరలో నా కెరీర్‌లో అత్యంత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాను. రిస్క్ తీసుకుంటూ, నా అంతర్‌దృష్టిని నమ్మి ముందుకు సాగుతున్నాను. ఈ రోజు నేను సాధించిన చిన్న విజయాలను కూడా జరుపుకుంటున్నాను” అని సమంత తెలిపారు. ఈ వ్యాఖ్యలన్నీ ఆమె వృత్తిపరమైన ఎదుగుదల, ధైర్యంగా తీసుకున్న అడుగుల గురించి ప్రస్తావించడం స్పష్టమవుతోంది.
తనతో కలిసి పనిచేసిన వారిని ప్రశంసిస్తూ, “నేను కలిసి పనిచేసిన వారు ప్రతిభావంతులు, కష్టపడి పనిచేసే నిజాయతీపరులు. వారికి నేను ఎంతో కృతజ్ఞతగా ఉన్నాను. ఇది నా కొత్త ప్రయాణానికి ఆరంభం మాత్రమే” అని సమంత పేర్కొన్నారు. వదంతులు ఎలా ఉన్నప్పటికీ, సమంత తన పోస్ట్‌లో వృత్తిపరమైన విజయం, కృతజ్ఞత, అభివృద్ధి గురించే ప్రధానంగా ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ ఫొటో మరియు సమంత పోస్ట్ చేసిన నోట్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి.









