Search
Close this search box.

  ‘ఉస్తాద్ భగత్ సింగ్’ దర్శకుడు హరీశ్ శంకర్‌కు నటుడు పార్తిబన్ స్పెషల్ గిఫ్ట్!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, దర్శకుడు హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ తమిళ నటుడు, రచయిత, దర్శకుడు ఆర్. పార్తిబన్, దర్శకుడు హరీశ్ శంకర్‌కు తన అభిమానాన్ని చాటుకుంటూ ఒక అందమైన బహుమతిని అందించారు. ఈ సినిమా షూటింగ్‌లో తన చివరి రోజున పార్తిబన్ ఈ స్పెషల్ మెమెంటోను హరీశ్ శంకర్‌కు బహూకరించారు.

ఈ ఆత్మీయ ఘటనకు సంబంధించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో పంచుకుంది. “దర్శకుడు హరీశ్ శంకర్ ప్రతిభకు లెజెండరీ నటుడు, దర్శకుడు పార్తిబన్ గారు ముగ్ధులయ్యారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో తన చివరి పనిదినాన ఆయనకు ఒక ప్రత్యేక మెమెంటోను బహూకరించారు. ఈ ఆత్మీయత అందరి మనసులను గెలుచుకుంది” అని నిర్మాణ సంస్థ పేర్కొంది. హరీశ్ శంకర్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, పార్తిబన్‌కు ధన్యవాదాలు తెలిపారు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, అయనాంక బోస్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తయినట్టు చిత్రబృందం ప్రకటించింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు