Search
Close this search box.

  ఆది సాయికుమార్ ‘శంబాల’ ట్రైల‌ర్ విడుదల: క్రిస్మస్‌కు సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్!

టాలీవుడ్‌లో విభిన్న కథలతో ప్రేక్షకులను అలరించే ఆది సాయికుమార్ (Adi Sai kumar) నటిస్తున్న తాజా చిత్రం ‘శంబాల.. ఏ మిస్టిక్ వరల్డ్’ (Shambhala Movie) ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ సినిమా, సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్ జానర్‌లో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయనుంది. అర్చన అయ్యర్, స్వాసిక్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు.

ఈ సందర్భంగా విడుదలైన ట్రైలర్‌కు సాయికుమార్ వాయిస్ ఓవ‌ర్‌తో ఆసక్తికరమైన నేపథ్యాన్ని అందించారు. “కొన్ని వేల సంవ‌త్స‌రాల క్రితం ప‌ర‌మ‌శివుడికి, అసురుడికి మ‌ధ్య జ‌రిగిన ఒక భీక‌ర‌యుద్ధం ఈ క‌థ‌కి మూలం” అంటూ ట్రైలర్ మొదలవుతుంది. ఆకాశం నుంచి ఒక ఉల్క లాంటి రాయి ఒక ఊరిలో పడటం, ఆ తర్వాత ఆ ఊరిలో ప్రజలు వింతగా ప్రవర్తించడం కథాంశంపై ఉత్సుకతను పెంచుతుంది.

ఈ చిత్రంలో ఆది సాయికుమార్ భౌగోళిక శాస్త్రవేత్తగా ఓ ఛాలెంజింగ్ పాత్రలో కనిపించనున్నారు. ఉల్క పడిన తర్వాత ఊరిలో జరిగిన వింతల వెనుక ఉన్న రహస్యం ఏంటి, ఆ రహస్యాన్ని కనుగొని ప్రజలను హీరో ఎలా కాపాడాడు అనేదే ఈ సినిమా కథ. షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకొని డిసెంబర్ 25న (క్రిస్మస్) సందర్భంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు