మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ (Peddi) చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా గ్లింప్స్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించి, సినిమాపై విపరీతమైన ఆసక్తిని పెంచింది. ఈ నేపథ్యంలో నిర్మాతలు తాజాగా ఈ చిత్రంలో కథానాయిక జాన్వీ కపూర్ (Janhvi Kapoor) లుక్, పాత్ర పేరును వెల్లడించారు.
జాన్వీ కపూర్: పెద్ది నుంచి అదిరిపోయే అప్డేట్.. చరణ్ మూవీలో జాన్వీ పాత్ర ఇదే! ఒక మాసీ అవతార్‌లో జాన్వీ కపూర్ ఆచియమ్మగా భయం లేని, ఆవేశపూరితమైన లుక్‌లో కనిపిస్తున్నారు. నిర్మాతలు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు నటిలో అద్భుతమైన పరివర్తనను చూపుతూ సినిమా పల్లెటూరి నేపథ్యాన్ని, శక్తివంతమైన సౌందర్యాన్ని బలపరుస్తున్నాయి.
వి. సత్య సతీష్ కిలారు ఈ చిత్రాన్ని కనీవినీ ఎరుగని స్థాయిలో భారీగా నిర్మిస్తున్నారు. లెజెండరీ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.









