టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ మరో మల్టీస్టారర్ సినిమాకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈసారి ఆయన తన సరికొత్త కామెడీ టైమింగ్‌తో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించిన యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి ఒక భారీ కమర్షియల్ ఎంటర్‌టైనర్ చేయబోతున్నారు. రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ అందించిన కథతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇప్పటికే ఇద్దరు హీరోలకు స్క్రిప్ట్ వినిపించగా, వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారనే టాక్ బలంగా వినిపిస్తోంది. రవితేజ ఎనర్జీ, నవీన్ పోలిశెట్టి కామెడీ కలయిక తెరపై ప్రేక్షకులకు నవ్వుల పండుగలా ఉంటుందని అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు.
రవితేజ తన మాస్ టైమింగ్, ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్‌తో ఎప్పుడూ ప్రేక్షకులను అలరిస్తుంటారు. మరోవైపు, నవీన్ పోలిశెట్టి ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతి రత్నాలు’, ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ వంటి సినిమాలతో తనదైన ప్రత్యేక కామెడీ స్టైల్‌ను నిరూపించుకున్నారు. ఈ ఇద్దరు ఎనర్జిటిక్ స్టార్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూడటం ప్రేక్షకులకు చాలా ఎక్సైటింగ్ అంశం. ప్రస్తుతం రవితేజ ‘మాస్ జాతర’ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉండగా, నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ చిత్రంతో బిజీగా ఉన్నారు.
బెజవాడ ప్రసన్నకుమార్ రాసిన ఈ మాస్ అండ్ ఎంటర్‌టైనింగ్ కథ రవితేజను బాగా ఆకట్టుకుందట. కథలో మరో హీరోకి కూడా కీలక స్థానం ఉండడంతో నవీన్ పోలిశెట్టిని సంప్రదించారు. ఈ కథను స్వయంగా బెజవాడ ప్రసన్నకుమార్ డైరెక్ట్ చేస్తారా, లేక రవితేజ సూచనల మేరకు మరో దర్శకుడికి ఛాన్స్ దక్కుతుందా అనే దానిపై త్వరలో స్పష్టత రానుంది. ప్రస్తుతం ఈ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌కు సంబంధించి చర్చలు వేగంగా జరుగుతున్నాయి. టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్మాతలు కూడా ఈ కాంబినేషన్‌పై ఆసక్తి చూపుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.









