Search
Close this search box.

  రియలిస్టిక్ డ్రామా ‘రోలుగుంట సూరి’: ఫస్ట్ లుక్ విడుదల, రాజేంద్రప్రసాద్ ప్రశంసలు

విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న రియలిస్టిక్ ఎమోషనల్ డ్రామా చిత్రం ‘రోలుగుంట సూరి’ (Rolugunta Suri) ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ నటుడు ‘నటకిరీటి’ రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) తాజాగా ఆవిష్కరించారు. అనిల్ కుమార్ పల్లా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున పల్లా, ఆధ్యారెడ్డి, భావన నీలిపి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను తపస్వీ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై సౌమ్య చాందిని పల్లా నిర్మిస్తున్నారు. గ్రామీణ జీవన శైలి, నిజ జీవిత భావోద్వేగాలను ప్రతిబింబించే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది.

ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించిన అనంతరం నటకిరీటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ – “ఇలాంటి సినిమాలు సైలెంట్‌గా వచ్చి పెద్ద సంచలనం సృష్టిస్తాయి. దర్శకుడు అనిల్ కుమార్ పల్లా హృదయాన్ని తాకే సబ్జెక్ట్‌ని చాలా అద్భుతంగా తెరపైకి తీసుకొస్తున్నారు. ఫస్ట్ లుక్ చాలా ఇంప్రెస్ చేసింది. సినిమా కూడా అలాగే అద్భుతంగా ఉండబోతోందనే నమ్మకం ఉంది,” అని చిత్ర‌యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు. దర్శకుడు అనిల్ కుమార్ పల్లా రాజేంద్రప్రసాద్ గారి అభినందనలు తమకు మరింత నమ్మకం, ఉత్సాహం ఇచ్చాయని, అదే ఉత్సాహంతో సినిమాను అద్భుతంగా తీర్చిదిద్ది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

నిర్మాత సౌమ్య చాందిని పల్లా మాట్లాడుతూ – ‘రోలుగుంట సూరి’ ఒక రియలిస్టిక్ విలేజ్ డ్రామా అని, భావోద్వేగాలు, జీవిత సత్యాలతో కూడిన ఈ కథ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు. తమ టీమ్‌లోని ప్రతి ఒక్కరూ తమ ప్రతిభను అద్భుతంగా చూపుతున్నారని, ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయేలా అవుతుందనే నమ్మకం తమకు ఉందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. యూనిట్ సభ్యులు కూడా ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరమైన స్థానం సంపాదిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు