Search
Close this search box.

  డిసెంబరు 25న విడుదల కానున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా ‘పతంగ్’

స్పోర్ట్స్ డ్రామా చిత్రాల శ్రేణిలో, పతంగుల పోటీ నేపథ్యంతో రూపొందుతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘పతంగ్’ (Patang). సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిష‌న్ సినిమాస్ ప‌తాకంపై విజ‌య్ శేఖ‌ర్ అన్నే, సంప‌త్ మ‌క, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్ర‌ణీత్ ప్ర‌త్తిపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఇన్‌స్టాగ్రమ్ సెన్సేష‌న్ ప్రీతి ప‌గ‌డాల‌, జీ స‌రిగ‌మ‌ప ర‌న్న‌ర‌ప్ ప్ర‌ణ‌వ్ కౌశిక్, వంశీ పూజిత్ ముఖ్య‌తార‌లుగా నటిస్తున్నారు. ప్రముఖ సింగ‌ర్, న‌టుడు ఎస్‌పీ చ‌ర‌ణ్ ఈ సినిమాలో కీల‌క‌మైన పాత్ర‌లో కనిపించనున్నారు. ఇప్పటికే చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ సినిమాను డిసెంబరు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేక‌ర్స్ ప్రకటించారు.

‘పతంగ్’ చిత్రం క్వాలిటీతో కూడిన థియేట్రికల్ అనుభూతిని అందించడానికి నిర్మాతలు హెవీ సీజీ వర్క్‌ను అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో చేయిస్తున్నారు. చిత్ర టీజర్‌కు, ఇటీవల విడుదల చేసిన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, ఈ సినిమా థియేటర్‌లో యూత్‌ఫెస్టివల్‌లా వుంటుందని, కొత్త నటీనటులతో చేసినా చాలా పెద్ద సినిమా క్వాలిటీతో ఉంటుందని తెలిపారు. ఈ చిత్రానికి కథే హీరో అని, జోస్ జిమ్మి అందించిన పాటలు వింటుంటే అంద‌రిలో పాజిటివ్ వైబ్స్ క‌లుగుతాయ‌ని అన్నారు.

సినిమా చూస్తున్నంత సేపు పతంగుల పోటీ ప్రేక్షకులలో ఉత్సుకతను కలిగిస్తుందని నిర్మాతలు ధీమా వ్యక్తం చేశారు. ‘పతంగ్’ చిత్రం అన్నివ‌ర్గాల వారిని అల‌రిస్తుంద‌నే నమ్మకం వుందని, కొత్త కంటెంట్‌ను ఆదరించే తెలుగు ప్రేక్షకులు తమ ప్రయత్నాన్ని తప్పకుండా ఆదరిస్తారనే విశ్వాసాన్ని వారు వ్యక్తంచేశారు. డిసెంబరు 25న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఈ సందర్భంగా వారు పునరుద్ఘాటించారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు