టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తన కెరీర్‌లోని ప్రతిష్టాత్మక 100వ చిత్రంను ఇటీవల సైలెంట్‌గా ప్రారంభించారు. ఈ సినిమాకు తమిళ దర్శకుడు ఆర్. కార్తీక్ మెగాఫోన్ పట్టారు. ఇప్పుడే షూటింగ్ మొదలైన ఈ ప్రాజెక్టుపై నాగ్ ఏ రకమైన కథతో వస్తారు? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.
ఇదిలా ఉంటే, ఈ సినిమాకు ‘లాటరీ కింగ్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. టైటిల్ వినిపిస్తున్న ధోరణి చూస్తే, యూనిక్‌కు కథతో, వినోదంతో కూడిన సినిమా అవుతుందనే అంచనాలు మొదలయ్యాయి.
ఇక క్యాస్టింగ్ విషయంలో ఓ ఆసక్తికరమైన అప్డేట్ వినిపిస్తోంది. గతంలో నాగార్జునతో కలిసి ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడా మా ఆవిడే’ వంటి హిట్ సినిమాల్లో నటించిన సీనియర్ హీరోయిన్ టబూ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఈ జంట చివరిసారి 2001లో తెరపై కనిపించి, అప్పటినుంచి కలిసి నటించలేదు. ఇప్పుడు మళ్లీ నాగార్జున 100వ సినిమాలో టబూ జాయిన్ అవుతుందనే వార్త అభిమానుల్ని ఫుల్ ఖుషీ చేస్తోంది.
అయితే, టబూ క్యాస్టింగ్‌పై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది. మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చిన తర్వాతనే అఫీషియల్ కన్ఫర్మేషన్ పొందాలి..









