Search
Close this search box.

  దసరాకి “పెద్ది” ట్రీట్..! మెగా ఫ్యాన్స్ గెట్ రెడీ..!

ఈ ఏడాది గేమ్ ఛేంజర్తో అభిమానులను నిరాశపరిచిన గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, ప్రస్తుతం పెద్ది చిత్రంలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో, సుకుమార్ రైటింగ్స్‌తో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై సతీష్ కిలారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. విలేజ్ స్పోర్ట్స్–రివేంజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్ సానా బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నాడు.

హీరోయిన్‌గా దేవర విజయంతో బిజీగా ఉన్న జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన లభించింది. ముఖ్యంగా చివర్లో రామ్‌చరణ్ ఆడిన ఐకానిక్ క్రికెట్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సినిమా హైప్ మరింత పెరిగింది. ఈ చిత్రం రామ్‌చరణ్ పుట్టినరోజు కానుకగా వచ్చే మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

హైదరాబాద్ పరిసరాల్లో, రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ వేసి పవర్‌ఫుల్ యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించారు. అలాగే మైసూరులో వెయ్యిమంది డ్యాన్సర్లతో జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో ప్రత్యేక గీతం చిత్రీకరించారు. ఈ పాట సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ అందిస్తున్న సంగీతం కూడా మరో పెద్ద ప్లస్ పాయింట్ కానుంది.

ఫస్ట్ లుక్, గ్లింప్స్ తర్వాత ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో చెర్రీ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ దసరా పండగ సందర్భంగా మెగా ఫ్యాన్స్ కోసం మేకర్స్ సింగిల్ రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే రామ్‌చరణ్ ఆ పాట విని “అద్భుతంగా ఉంది” అని చెప్పాడట.

ఇక మరోవైపు, ఈ దసరా రోజున చిరంజీవి – బాబీ కొల్లి కాంబోలో రెండో చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ కావడంతో, ఈ కొత్త ప్రాజెక్ట్‌పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో రాబోయే దసరాకి తండ్రీ–కొడుకులు ఇద్దరూ మెగా అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు