పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా, దర్శకుడు సుజీత్ రూపొందిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ఓజి”. పవన్ కెరీర్‌లోనే భారీ ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా కోసం అభిమానులతో పాటు డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
మొదట “ఓజి” – “అఖండ 2” ఒకేసారి విడుదలయ్యే అవకాశం ఉందని టాక్ వినిపించినా, ఇప్పుడు ఆ అనుమానాలకు చెక్ పడింది. తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఈ సెప్టెంబర్ 25న థియేటర్స్‌లో అడుగుపెట్టేది “ఓజి” మాత్రమే అని ఖరారైంది. ముఖ్యంగా అన్ని ఏరియాస్‌లో బిజినెస్ ఇప్పటికే క్లోజ్ అయ్యిందన్న వార్త వెలువడటంతో, మూవీ రాక గ్యారెంటీ అయిందని చెప్పొచ్చు.
ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తుండగా, భారీ స్థాయిలో నిర్మాణం డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు చేపట్టారు. పవన్ కళ్యాణ్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఈ వార్త నిజంగా పండుగే అని చెప్పాలి..