ప్రేమకథలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్తో కెరీర్‌ను ఆరంభించిన నాని, తన సహజ నటనతో “నేచురల్ స్టార్”గా పేరు సంపాదించుకున్నాడు. ఒకే రకమైన పాత్రల్లో కాకుండా విభిన్నత చూపించాలని నిర్ణయించుకున్న ఆయన, ఇటీవల విడుదలైన ‘హిట్ 3’లో కొత్త లుక్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’లో నటిస్తూనే, మరో రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వాటిలో ఒకటి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఉండబోతోందన్న వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది…ఈ సినిమాలో హీరోయిన్గా సాయిపల్లవిని తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. ఈ వార్త నిజమైతే, నాని–సాయిపల్లవి జంట ‘ఎంసీఏ’, ‘శ్యామ్ సింగరాయ్’ తర్వాత మళ్లీ ఒకే తెరపై కనిపించనుంది. ఇప్పటికే హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ఇద్దరు మళ్లీ కలిసి నటించబోతున్నారన్న వార్త ఫ్యాన్స్‌లో హైప్ క్రియేట్ చేస్తోంది. శేఖర్ కమ్ములకి కూడా సాయిపల్లవి ఫేవరెట్ హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. ఆమెతో చేసిన ‘ఫిదా’, ‘లవ్ స్టోరీ’ వంటి చిత్రాలు సూపర్ హిట్స్ సాధించాయి. ముఖ్యంగా ‘ఫిదా’లో ఆమె తెలంగాణ యాసలో పలికిన డైలాగులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో నాని–శేఖర్ కమ్ముల–సాయిపల్లవి కాంబినేషన్ ఒకేసారి రావడం పరిశ్రమలో పెద్ద చర్చగా మారింది..ఇక సాయిపల్లవి విషయానికి వస్తే—తాజాగా నాగచైతన్యతో నటించిన ‘తండేల్’ బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘రామాయణ’లో సీత పాత్రలో నటిస్తోంది. రణ్‌బీర్ కపూర్, యష్‌లతో కలిసి నటిస్తున్న ఈ చిత్రం దాదాపు ₹4,000 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమవుతోంది. మేకర్స్ ఈ సినిమాను 2026–27లో విడుదల చేయాలని ఇప్పటికే ప్రకటించారు..
