పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ ఇప్పుడు ఊపందుకున్నా, అసలైన ఆరంభం బాలీవుడ్ నుంచే జరిగింది. ఆ లిస్టులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఫ్రాంచైజ్ ‘ధూమ్’ సిరీస్. సాలిడ్ యాక్షన్‌తో రూపొందిన ఈ మూడు సినిమాలు వరుస విజయాలు సాధించడంతో, తెలుగు సహా అన్ని భాషల్లోనూ విపరీతమైన క్రేజ్ సంపాదించాయి.
ఇప్పుడంతా ‘ధూమ్ 4’ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై ఎన్నో వార్తలు వినిపిస్తున్నా, తాజాగా మరో కొత్త టాక్ హల్చల్ చేస్తోంది. తాజాగా తెలిసిన ప్రకారం, ఈ సినిమాను ‘వార్ 2’ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. అంతేకాదు, సినిమాలో కీలకమైన పాత్ర కోసం ఒక టాలీవుడ్ స్టార్ హీరోను సంప్రదించారని సమాచారం.
అయితే ఆ స్టార్ ఎవరు? ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? లేదా? అనే క్లారిటీ మాత్రం త్వరలోనే బయటకు రానుంది. కానీ ఈ రూమర్‌తో అభిమానుల్లో ఉత్కంఠ మాత్రం పెరిగిపోతోంది.