‘అభయ్ చరణ్ ఫౌండేషన్’ మరియు ‘శ్రీజీ ఎంటర్‌టైన్‌మెంట్’ సంయుక్తంగా ఓ మహత్తర చారిత్రక కావ్యాన్ని తెరపైకి తీసుకురాబోతున్నారు. ఈ విభిన్నమైన ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇటీవల అధికారిక టైటిల్‌ను ప్రకటించారు. “శ్రీ కృష్ణ అవతార్ ఇన్ మహోబా” పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలు అనిల్ వ్యాస్ వహిస్తుండగా, కథ, స్క్రీన్‌ప్లే మరియు దర్శకత్వాన్ని ముకుంద్ పాండే స్వయంగా చేపట్టారు.
ISKCON–ఢిల్లీకి చెందిన సీనియర్ ప్రీచర్ జితామిత్ర ప్రభు శ్రీ ఆశీస్సులతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం, 11-12వ శతాబ్దాల నాటి మహోబా సాంస్కృతిక వైభవాన్ని, భగవాన్ శ్రీకృష్ణుడి దివ్య గాథలను ఆవిష్కరించనుంది. ముఖ్యంగా, సినీ పరిశ్రమలో తొలిసారిగా శ్రీకృష్ణుడిని ఒక యుద్ధవీరుడి రూపంలో చూపించబోవడం విశేషం.
‘శ్రీ కృష్ణ అవతార్ ఇన్ మహోబా’ పాన్-వరల్డ్ స్థాయిలో రూపొందుతున్న ప్రాజెక్ట్‌గా, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను తాకేలా మలచబడుతోంది. అత్యున్నత స్థాయి టెక్నీషియన్లతో తెరకెక్కుతున్న ఈ చిత్రం, చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, ఆధ్యాత్మికతను సమన్వయం చేస్తుంది.
ప్రస్తుతం టైటిల్, నిర్మాణ సంస్థలు మరియు క్రియేటివ్ టీమ్ వివరాలు మాత్రమే వెల్లడించగా, నటీనటులు మరియు సాంకేతిక బృందానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు..