కింగ్ నాగార్జున ప్రస్తుతం ‘కూలీ’ సినిమా ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇందులో ఆయన సైమన్ అనే నెగటివ్ రోల్‌లో, స్టైలిష్ లుక్‌తో కొత్త షేడ్స్ చూపించి ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేశాడు. అంతకుముందు ‘కుబేరా’లో ‘దీపక్’ పాత్రలో కనిపించి, తన స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో మరోసారి తనకే సాటి లేడని నిరూపించాడు.
ఇక నాగార్జున తన తదుపరి ప్రాజెక్ట్‌ను తమిళ దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వంలో చేయబోతున్నారు. రా కార్తీక్ ఇప్పటివరకు ‘ఆకాశం’, ‘నితమ్ ఒరు వానం’ వంటి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్స్‌కి పేరుగాంచారు. ఆయనతో నాగ్ చేస్తున్న ఈ కొత్త సినిమా ప్రత్యేకతను సంతరించుకుంది. ముఖ్యంగా ఇది నాగార్జున కెరీర్‌లో 100వ చిత్రం కావడంతో అభిమానులు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
తాజా సమాచారం ప్రకారం నాగ్ జన్మదినం ఆగస్టు 29న ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని వినిపిస్తోంది. ఆ రోజునే ఆయన కొత్త లుక్‌ను కూడా రివీల్ చేయనున్నారని టాక్.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నాగార్జున స్వయంగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించబోతున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో హిట్ సినిమాలు అందించిన ఈ బ్యానర్ యాభై ఏళ్లు పూర్తిచేసుకుంటున్న తరుణంలో, అదే సందర్భంలో నాగ్ 100వ సినిమా రూపుదిద్దుకోవడం విశేషం..