స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం సహజమే. కానీ వారసురాళ్లు హీరోయిన్‌గా రంగప్రవేశం చేయడం మాత్రం చాలా అరుదు. తమిళంలో కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ మాత్రమే ఆ గ్యాప్‌ని బ్రేక్ చేసి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది…టాలీవుడ్‌లో కూడా ముప్పై ఏళ్ల క్రితం సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజులను హీరోయిన్‌గా పరిచయం చేయాలని ప్రయత్నం జరిగింది…బాలకృష్ణ సరసన ఆమెను ఆలోచించినా, అప్పటి పరిస్థితులు, అభిమానుల వ్యతిరేకత కారణంగా ఆ ఆలోచన అక్కడికక్కడే ఆగిపోయింది. తర్వాత మంజుల కొన్ని ప్రయోగాత్మక చిత్రాలు చేసినా, పూర్తిగా నటనకు దూరమయ్యారు..ఇప్పుడొస్తున్న తరం పరిస్థితులు మాత్రం వేరేలా ఉన్నాయి. ప్రేక్షకుల ఆలోచనల్లోనూ మార్పు వచ్చింది. అందుకే వారసురాళ్లను కూడా సినిమాల్లోకి తీసుకురావడానికి స్టార్ కుటుంబాలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఘట్టమనేని రమేష్ బాబు కూతురు భారతి రంగప్రవేశం చేయబోతుందన్న వార్త ఫిల్మ్‌నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. రమేష్ బాబు ఇక లేని సమయంలో ఆయన పిల్లల కెరీర్‌ని మహేష్ బాబే ముందుకు తీసుకువెళ్తున్నారని టాక్. ఇప్పటికే రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఎంట్రీకి అజయ్ భూపతి దర్శకత్వంలో స్క్రిప్ట్ లాక్ అయ్యింది. పెద్ద నిర్మాణ సంస్థలు ఈ ప్రాజెక్టులో భాగమవుతున్నాయన్న ప్రచారం కూడా గట్టిగానే ఉంది..ఇక భారతి ఎంట్రీకి దర్శకుడు తేజ ముందుకు వచ్చారట.. తనకొడుకుని హీరోగా లాంచ్ చేసే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌లోనే భారతిని హీరోయిన్‌గా పరిచయం చేయబోతున్నారని సమాచారం. ఈ కథను మహేష్ వింటారని, తేజతో ఆయనకు ఉన్న మంచి అనుబంధం వల్ల గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయం అనిపిస్తోంది..అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, జయకృష్ణ–భారతి ఇద్దరూ ఒకేసారి రంగప్రవేశం చేసే అవకాశం బలంగానే కనిపిస్తోంది. ఇక ఈ స్టార్ వారసుల ఎంట్రీ టాలీవుడ్‌లో ఎంత క్రేజ్ క్రియేట్ చేస్తుందో చూడాలి..
