Search
Close this search box.

  పెద్ది లో చరణ్ – జాన్వీ కెమిస్ట్రీ..! మాంటేజ్ సాంగ్ ప్లాన్..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవెయిటెడ్ సినిమా పెద్ది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.

మాంటేజ్ సాంగ్ ప్లాన్

ఇప్పటికే ఒక పాటను పూర్తి చేసిన మేకర్స్, త్వరలోనే రామ్ చరణ్ – జాన్వీ కపూర్‌లపై ప్రత్యేక మాంటేజ్ సాంగ్‌ను చిత్రీకరించబోతున్నారని సమాచారం. ఈ పాట కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే కాకుండా కథను ముందుకు నడిపేలా బుచ్చిబాబు ప్రత్యేకంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

చరణ్ – జాన్వీ కెమిస్ట్రీని హైలైట్ చేస్తూ, ఈ మాంటేజ్ సాంగ్ సినిమాలో అత్యంత గుర్తుండిపోయే సన్నివేశాలలో ఒకటిగా నిలుస్తుందని సినీ వర్గాల టాక్.

సినిమా విశేషాలు

ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 27, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు