Search
Close this search box.

  వారు ఎంటర్టైన్మెంట్ చేస్తారు.. మేము ఎడ్యుకేట్ చేస్తాం..: ఎ ఆర్ మురగదాస్ కీలక వాఖ్యలు..

ఎస్‌.ఎస్‌. రాజమౌళి బాహుబలి తెరకెక్కించిన తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొత్త హోదా వచ్చింది. ఆ సినిమా కేవలం బాక్సాఫీస్ హిట్ మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినీ పరిశ్రమ ప్రతిష్టను పెంచింది. దాంతో అనేక మంది దర్శకులు పాన్‌ ఇండియా స్థాయిలో సినిమాలు చేయడానికి ముందుకొచ్చారు. వాటిలో కొన్ని సూపర్‌హిట్స్ అయితే, మరికొన్ని నిరాశపరిచాయి…

బాహుబలి తర్వాత సుకుమార్ పుష్ప, నాగ అశ్విన్ కల్కి 2898 AD, రాజమౌళి ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలు తెలుగు సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చాయి. దీంతో ప్రస్తుతం తెలుగు దర్శకులు నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నారని అందరూ నమ్ముతున్నారు. తెలుగు ప్రేక్షకులు ఒక సినిమా నచ్చితే ఎంత ఆదరిస్తారో వేరే చెప్పాల్సిన పనిలేదు..

ఇలాంటి సమయంలో తమిళ దర్శకుడు ఏ.ఆర్‌. మురుగదాస్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… “1000 కోట్ల సినిమాలు తీసేవాళ్లు ఎంటర్టైన్ చేస్తారు, కానీ తమిళ దర్శకులు మాత్రం ఎడ్యుకేట్ చేస్తారు” అని కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలతో ఆయన, 1000 కోట్ల సినిమాలు తీసిన దర్శకులను (ప్రత్యేకంగా తెలుగు వారిని) తక్కువ చేసి మాట్లాడినట్లే అనిపించింది.

దీంతో సోషల్ మీడియాలో మురుగదాస్‌పై విపరీతమైన ట్రోలింగ్ మొదలైంది. “మీరు షెడ్‌కి వెళ్లిపోయారు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు”, “కాపీ కథలు తీసే మీరేనా ఎడ్యుకేట్ చేసే దర్శకులు?” అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

‘మదరాసి’కి ముందు కాంట్రవర్సీ

ప్రస్తుతం మురుగదాస్, శివకార్తికేయన్ హీరోగా మదరాసి అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉండగా, ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రాజెక్ట్‌కి నష్టం కలిగే అవకాశముందని టాక్ వస్తోంది. ఎందుకంటే 1000 కోట్ల మార్క్‌ను దాటిన దర్శకులు తెలుగు వారే ఎక్కువ. కాబట్టి ఈ కాంట్రవర్సీ ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు