‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్, కోలీవుడ్ స్టార్ ధనుశ్‌తో తనపై వస్తున్న డేటింగ్ రూమర్లకు తెరదించారు. గత కొంతకాలంగా కొనసాగుతున్న ప్రచారంపై స్పందించిన ఆమె, “ధనుశ్ నాకు కేవలం మంచి స్నేహితుడు మాత్రమే. మా మధ్య ప్రేమ వ్యవహారం లేదు” అని స్పష్టం చేశారు.
ఇటీవల జరిగిన ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ స్క్రీనింగ్‌కు ఇద్దరూ హాజరుకావడంతో రూమర్లు ఊపందుకున్నాయి. దీనిపై మృణాల్, “ఆహ్వానం మేరకే ధనుశ్ వచ్చారు. దాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు” అన్నారు. అలాగే ‘తేరే ఇష్క్ మే’ ర్యాప్-అప్ పార్టీ, ధనుశ్ సోదరీమణులను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయడం వంటి అంశాలు కూడా ఈ ఊహాగానాలకు కారణమయ్యాయని తెలిపింది..గమనించదగ్గ విషయం ఏమిటంటే, 2022లో ధనుశ్, రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యతో 18 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికారు. వారికి యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు..