హను రాఘవపూడి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ (వర్కింగ్ టైటిల్) చిత్రంపై ఇప్పటివరకు మేకర్స్ ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. ప్రారంభ వేడుక హడావుడి తప్ప, సినిమా గురించి పెద్దగా సమాచారం వెలువడలేదు. అయితే తాజాగా షూటింగ్ విషయమై వచ్చిన సమాచారం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.
సైలెంట్‌గా ప్రభాస్ ఇప్పటికే ఫౌజీ షూటింగ్‌లో 50% పూర్తి చేశారని, ఇంకా తన పాత్రకు సంబంధించిన 30 రోజుల కాల్షీట్స్ ఇస్తే మొత్తం షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్, ఫౌజీ చిత్రాల షూటింగ్స్‌ను ఒకేసారి కొనసాగిస్తున్నాడు. ఈ ఏడాదిలోనే ఫౌజీ షూటింగ్ దాదాపు పూర్తవుతుందని, ప్రభాస్ షూటింగ్ ముగిసిన తర్వాత మిగతా నటులతో కొద్దిపాటి సన్నివేశాలు పూర్తి చేస్తే సినిమా పూర్తి స్థాయిలో సిద్ధమవుతుందని చెబుతున్నారు.
మిగిలిన 30 రోజుల షూటింగ్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలను హను రాఘవపూడి తెరకెక్కించనున్నారని, అవే సినిమా హైలైట్ అవుతాయని అంటున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వి నటిస్తోంది. వీరి కలయికలో వచ్చే రొమాంటిక్ సీన్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే మరో హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం..