యంగ్ టైగర్ ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘వార్ 2’ ఈ ఏడాది ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఇప్పుడు ఎన్టీఆర్ తదుపరి సినిమా గురించి ఓ క్రేజీ అప్‌డేట్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇండస్ట్రీ టాక్ ప్రకారం, కన్నడలో భారీ విజయాన్ని సాధించిన ‘కాంతార’ ఫ్రాంచైజీ మూడో భాగంలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించనున్నారట. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేనప్పటికీ, ‘కాంతార’ దర్శకుడు రిషబ్ శెట్టితో ఎన్టీఆర్‌కు ఉన్న స్నేహబంధం కారణంగా ఈ వార్త మరింత బలంగా వినిపిస్తోంది.
ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎన్టీఆర్ తన పరిధిని కన్నడ ఇండస్ట్రీలోకి విస్తరించనున్నారని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ చిత్రంలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కోసం కూడా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..