Search
Close this search box.

  డైలామాలో రాజాసాబ్..? ఇలా ఐతే కష్టమే అంటున్న ఫాన్స్..?

రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా హారర్-కామెడీ సినిమా “రాజాసాబ్” విడుదల తేదీపై అభిమానుల్లో గందరగోళం నెలకొంది.. మేకర్స్ గతంలో ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న విడుదల చేస్తామని ప్రకటించినా, తాజాగా నటి మాళవిక మోహనన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో ఆ తేదీ ప్రస్తావన లేకపోవడం కొత్త ఊహాగానాలకు దారితీసింది. దీంతో సినిమా వాయిదా పడుతుందేమోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు..కొన్ని నివేదికల ప్రకారం, మేకర్స్ ఈ చిత్రాన్ని 2026 జనవరిలో విడుదల చేయాలని ఆలోచిస్తున్నారట. అయితే, దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. వాయిదా పడితే ఇది రెండోసారి అవుతుంది. అభిమానులు మాత్రం స్పష్టమైన అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్నారు..దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ కథానాయికలుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. గ్లింప్స్‌లో ప్రభాస్ స్టైలిష్ లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.“రాజాసాబ్” మొత్తం బడ్జెట్ ₹400 కోట్లు. డిజిటల్ హక్కులు మరియు “పవర్ ఆఫ్ ప్రభాస్” బ్రాండ్ వల్ల ఇప్పటికే ₹362 కోట్లు రికవరీ అయ్యాయి..ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయగా, సంజయ్ దత్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ (తెలుగు సినిమా డెబ్యూ), రిద్ధి కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ 2024 జనవరిలో అధికారికంగా ప్రకటించబడినా, ప్రధాన ఫోటోగ్రఫీ మాత్రం 2022 అక్టోబర్‌లోనే ప్రారంభమైంది.అధికారిక విడుదల తేదీ కోసం అభిమానులు ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు