Search
Close this search box.

  “పెద్ది” లో వైరల్ వయ్యారి..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – జాన్వీ కపూర్ జంటగా, “ఉప్పెన” ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం “పెద్ది”. మొదటి నుంచే భారీ హైప్ క్రియేట్ చేసుకున్న ఈ పాన్ ఇండియా మూవీ షూటింగ్‌ను మేకర్స్ వేగంగా పూర్తి చేస్తున్నారు..ఈ సినిమాలో ఓ స్పెషల్ ఫోక్ సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నారని, ఆ పాటలో నటించడానికి యంగ్ అండ్ ఎనర్జిటిక్ బ్యూటీ శ్రీలీలను ఫైనల్ చేసినట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇదివరకు కూడా ఆమె ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుందనే వార్తలు వచ్చినప్పటికీ, ఇప్పుడు మాత్రం ఈ ఫోక్ సాంగ్ విషయమై దాదాపు ఖరారే అని రూమర్స్ మరింత బలపడుతున్నాయి..ఇటీవల జూనియర్  సినిమాలో వచ్చిన వైరల్ సాంగ్‌లో శ్రీలీల చేసిన ఎనర్జీటిక్ డ్యాన్స్ ఎలా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది  అందరికీ తెలిసిందే. మరి “పెద్ది”లో ఆమె గ్లామర్ & డ్యాన్స్ మాజిక్ నిజంగానే చూడబోతున్నామా? అన్నది అధికారిక ప్రకటన వెలువడితేనే క్లారిటీ వస్తుంది.లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వృద్ధి సినిమాస్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. వచ్చే ఏడాది మార్చి 27న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్ కానుంది..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు