పెద్ద స్టార్ హీరోలు, టాప్ డైరెక్టర్లు, భారీ సెట్లు… ఇవన్నీ లేకుండానే ఒక సినిమా హిట్ కావచ్చు అని మరోసారి నిరూపించింది మహావతార్ నరసింహ. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ యానిమేటెడ్ మూవీ, కంటెంట్ బలం మీదనే థియేటర్లలో దుమ్మురేపుతోంది. ప్రేక్షకులు మాటామాటకూ ఈ సినిమాను రికమెండ్ చేస్తూ, హౌస్‌ఫుల్ షోలకు కారణమవుతున్నారు.
8 రోజుల్లోనే 60 కోట్ల క్లబ్‌లోకి
హోంబలే ఫిల్మ్స్ వెల్లడించిన ప్రకారం, మహావతార్ నరసింహ కేవలం 8 రోజుల్లో రూ. 60.5 కోట్లకు పైగా వసూలు చేసి, భారతీయ యానిమేటెడ్ సినిమాల్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది.
> “అన్ని రికార్డులను చెరిపేసి, కేవలం 8 రోజుల్లోనే ఈ మైలురాయిని చేరుకుంది” – హోంబలే ఫిల్మ్స్ ట్వీట్.
అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, మహా విష్ణువు దశావతారాల ఆధారంగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్‌లో మొదటి అధ్యాయం. ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’ పేరుతో మేకర్స్ వచ్చే 10 ఏళ్లలో ప్రతి ఏడాది ఒక సినిమాను విడుదల చేయాలని ఇప్పటికే ప్రకటించారు..