Search
Close this search box.

  గూఢచారి 2 రిలీజ్ డేట్ ఫిక్స్..! ఎప్పుడంటే..?

2018లో విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ గుఢచారితో అడవి శేష్‌ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. శోభితా దూళిపాళ హీరోయిన్‌గా, శశి కిరణ్‌ టిక్క దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కేవలం రూ. 6 కోట్ల బడ్జెట్‌తో తీసి, బాక్సాఫీస్ వద్ద రూ. 30 కోట్లకు పైగా వసూలు చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అయిన ఈ చిత్రం, శశి కిరణ్‌కి తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది..గుఢచారి విజయానంతరం సీక్వెల్‌ ప్లాన్ చేసినా, అధికారిక ప్రకటన ఆలస్యం అయింది. గత ఏడాది పూజా కార్యక్రమం నిర్వహించినప్పటికీ, షూటింగ్ గురించి ఎలాంటి సమాచారం రాకపోవడంతో అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి. ఈలోగా అడవి శేష్‌ మరో ప్రాజెక్ట్ డెకాయిట్ షూటింగ్ పూర్తి చేస్తుండటంతో, గుఢచారి 2 (G2) నిలిచిపోయిందనే రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి..ఈ ఊహాగానాలకు బ్రేక్ వేస్తూ, మేకర్స్ తాజాగా G2 రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. 2026 మే 1న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. అంతేకాదు, హీరోయిన్‌గా బాలీవుడ్ భామ వామిక గబ్బర్ నటిస్తున్నట్లు లుక్ పోస్టర్ ద్వారా అధికారికంగా వెల్లడించారు..ఈ సినిమాలో ప్రధాన ప్రతినాయకుడిగా బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ కనిపించనున్నారు. రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో పాటు, మూడు ఇంట్రెస్టింగ్ పోస్టర్స్ విడుదల చేశారు..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు