Search
Close this search box.

  ఎస్‌.ఎస్‌.ఎం‌.బీ 29 లో హాలీవుడ్ రేంజ్ లో ఇంటర్వెల్స్ బ్యాంగ్..? ఇదీ నిజమైతే ఫ్యాన్స్ కు పండగే..!

పెద్ద స్టార్ హీరో సినిమా అనగానే, ఆ చిత్రానికి సంబంధించిన గాసిప్స్ వరుసగా బయటకు రావడం సహజం. అలాంటి వార్తలు విన్నప్పుడల్లా అభిమానుల్లో ఉత్సాహం పెరగడమే కాకుండా, సినిమాపై మరింత క్రేజ్‌ను రేకెత్తిస్తాయి. అదే పరిస్థితి ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఎస్‌.ఎస్‌.ఎం‌.బీ 29 విషయంలోనూ కనిపిస్తోంది.

లోయలో  స్థాయి ఇంటర్వెల్ సీక్వెన్స్

తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ కొత్త గాసిప్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సమాచారం ప్రకారం, ఇంటర్వెల్ సీక్వెన్స్ మొత్తం ఓ అద్భుతమైన లోయలో తెరకెక్కించబోతున్నారని, ఆ సన్నివేశాల్లో ఉండే ఫారెస్ట్ విజువల్స్, ఛేజింగ్ షాట్స్, యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ రేంజ్‌లో ఉంటాయని చెబుతున్నారు. ఈ ఎపిక్ బ్లాక్ సినిమాకి హైలైట్ అవుతుందని, ఇది యాక్షన్–అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను కొత్త అనుభవానికి తీసుకెళ్తుందని టాక్.

భారీ బడ్జెట్ – గ్లోబల్ రిలీజ్

ఎస్‌.ఎస్‌.ఎం‌.బీ 29 ను భారీ బడ్జెట్‌తో, అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కిస్తున్నారు. హీరోయిన్‌గా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తుండగా, ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే మెయిన్ విలన్‌గా ఒక హాలీవుడ్ నటుడిని తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది.

ప్రియాంక చోప్రా ఇండియాకు రాక

ఇటీవలి కాలంలో భర్త నిక్ జోనస్‌తో విదేశాల్లో ఉండిన ప్రియాంక, ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కోసం ఇండియాకు చేరుకుంది. తన కూతురు మాల్టీతో కలిసి వచ్చిన ఫోటోలు, వీడియోలను ఆమె స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకుంది. మహేష్ – ప్రియాంక మధ్య ఒక స్పెషల్ సాంగ్‌ను త్వరలో చిత్రీకరించనున్నారని సమాచారం..రోజుకొక క్రేజీ అప్‌డేట్ బయటకు వస్తుండటంతో, ఎస్‌.ఎస్‌.ఎం‌.బీ 29 పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇక తెరపై ఈ విజువల్ వండర్ ఎలా అలరిస్తుందో చూడాలి..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు