తాజాగా వెలువడిన జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు చిత్ర పరిశ్రమ ఘనవిజయం సాధించింది. మొత్తం ఏడు విభాగాల్లో తెలుగు సినిమాలు అవార్డులు అందుకోవడం గర్వించదగిన విషయంగా నిలిచింది.
🔹 ఉత్తమ తెలుగు చిత్రం: భగవంత్ కేసరి
నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది. సుళువైన కథలో బలమైన సందేశాన్ని సమర్పించిన ఈ సినిమా ప్రేక్షకులతో పాటు విమర్శకులను కూడా ఆకట్టుకుంది.
🔹 హనుమాన్‌కు రెండు అవార్డులు
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన విభిన్నమైన సూపర్‌హీరో మూవీ హనుమాన్కి రెండు జాతీయ అవార్డులు లభించాయి.
- ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ
- ఉత్తమ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగం
ఈ చిత్రంలోని విజువల్స్ ఇండియన్ సినిమాలో కొత్త మైలురాయిగా నిలిచాయి.
🔹 ఉత్తమ సాహిత్యం అవార్డు: బలగం
వేణు యెల్దండి తెరకెక్కించిన గ్రామీణ భావోద్వేగ చిత్రంగా బలగం విమర్శకుల ప్రశంసలతో పాటు జాతీయ అవార్డును కూడా అందుకుంది.
ఈ చిత్రంలోని “ఊరు పల్లెటూరు” పాటకు లిరిక్స్ అందించిన కాసర్ల శ్యామ్‌కు ఉత్తమ గేయ రచయితగా అవార్డు దక్కింది. సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందించారు.
🔹 బేబీ చిత్రానికి రెండు అవార్డులు
సాయిరాజేశ్ దర్శకత్వంలో వచ్చిన భావోద్వేగ ప్రేమకథ బేబీకు రెండు విభాగాల్లో జాతీయ పురస్కారాలు లభించాయి.
- ఉత్తమ స్క్రీన్‌ప్లే – సాయి రాజేశ్
- ఉత్తమ గాయకుడు – ‘ప్రేమిస్తున్నా’ పాటకు పాడిన పీవీఎన్‌ఎస్ రోహిత్
🔹 గాంధీతాత చెట్టు – ఉత్తమ బాలనటి అవార్డు
సుకుమార్ కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి నటించిన గాంధీతాత చెట్టు చిత్రానికి ఉత్తమ బాలనటి విభాగంలో జాతీయ అవార్డు దక్కింది.
పద్మావతి మల్లాది దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేకంగా నిలిచింది..