పవన్ కళ్యాణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఓజీ’. ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘సాహో’ తర్వాత సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పైన భారీ అంచనాలున్నాయి. ‘సాహో’ ఆశించిన ఫలితాన్ని అందుకోకపోయినప్పటికీ, ‘ఓజీ’ ప్రకటించినప్పటి నుంచే పాజిటివ్ బజ్ కొనసాగుతోంది..ఆరంభంలో రీమేక్ కోసం సుజిత్‌ను సంప్రదించినప్పటికీ, తనలో ఉన్న ఒరిజినల్ కథను పవన్ కళ్యాణ్ ఎదుట ఉంచే అవకాశం దొరకడంతో అదే కథకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఆ కథే ‘ఓజీ’..ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ కోసం అభిమానులు ఎంతకాలంగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా DVV ఎంటర్టైన్మెంట్ సంస్థ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం, ఫస్ట్ సింగిల్ ఆగస్ట్ 2 సాయంత్రం 6 గంటలకు విడుదల కాబోతోంది. సంగీత దర్శకుడు తమన్ ఇప్పటికే ఆడియో ఫైల్ పంపించేశాడు. అతని చాట్ స్క్రీన్‌షాట్‌ను కూడా నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసింది, ఇది నెట్టింట వైరల్ అవుతోంది..ఈ సాంగ్‌కు మరో హైలైట్ – టాలెంటెడ్ నటుడు, గాయకుడు శింబు గాత్రం. ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన శింబు, పలు తెలుగు పాటలు పాడాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం ఓ జోష్ ఫుల్ సాంగ్‌ను ఆలపించాడు. ఈ విషయాన్ని తమన్ ఒక ప్రాంక్ కాల్ ద్వారా బయటపెట్టాడు..
ఈ చిత్ర ప్రమోషన్లు కూడా భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఫ్యాన్స్‌ను ఆకట్టుకునే విధంగా DVV బేనర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం, ట్వీట్లకు క్రేజీ రిప్లైలు ఇవ్వడం సినిమాపై మరింత హైప్ పెంచుతోంది.మొత్తానికి, ‘ఓజీ’ ఫైర్ స్ట్రోమ్కి ఆరంభం కావడానికి రెడీ అయింది. రేపు సాయంత్రం విడుదలకానున్న ఫస్ట్ సింగిల్‌తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జోష్ పీక్స్‌కి వెళ్లనుంది..!