Search
Close this search box.

  మరోసారి మాస్ కాంబో రిపీట్..? బాబీ డైరెక్షన్లో బాస్..?

July 28, 2025 11:00 PM | Aditya369 News

మరోసారి మాస్ కాంబో రిపీట్..? బాబీ డైరెక్షన్లో బాస్..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన సోషియో ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ చిత్రం చివరి షెడ్యూల్‌లో పాల్గొంటుండగా, అదే సమయంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న #మెగా157 సినిమాకు కూడా కమిట్ అయ్యార..ఈ రెండు ప్రాజెక్టుల తర్వాత కూడా తన కెరీర్‌ను మరింత శక్తివంతంగా కొనసాగించాలని చిరు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా, చిరు – బాబీ (కేఎస్ రవీంద్ర) కాంబో మళ్లీ రిపీట్ కానుందని ఫిల్మ్ నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కాంబోలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు మళ్లీ బాబీతో కలిసి కొత్త సినిమా చేయడానికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమాను సెప్టెంబర్ 2025లో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు బాబీ ఏర్పాట్లు చేస్తున్నాడట. ఈ ప్రాజెక్ట్‌కు సినిమాటోగ్రఫర్‌గా కార్తిక్ ఘట్టమనేని వ్యవహరించనున్నారనే సమాచారం కూడా లభిస్తోంది..ఇక ఈసారి బాబీ, చిరంజీవి కోసం పంచ్ పావర్ ఉన్న కథను రెడీ చేస్తున్నాడా? ఆయన ఈ కాంబోకు మరో సూపర్ హిట్ అందిస్తాడా? అనే ఆసక్తికర ప్రశ్నలు అభిమానుల్లో నెలకొన్నాయి. అధికారిక ప్రకటన ఎప్పుడైనా రావొచ్చు అనే అంచనాలతో మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు