మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన సోషియో ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ చిత్రం చివరి షెడ్యూల్‌లో పాల్గొంటుండగా, అదే సమయంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న #మెగా157 సినిమాకు కూడా కమిట్ అయ్యార..ఈ రెండు ప్రాజెక్టుల తర్వాత కూడా తన కెరీర్‌ను మరింత శక్తివంతంగా కొనసాగించాలని చిరు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా, చిరు – బాబీ (కేఎస్ రవీంద్ర) కాంబో మళ్లీ రిపీట్ కానుందని ఫిల్మ్ నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కాంబోలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు మళ్లీ బాబీతో కలిసి కొత్త సినిమా చేయడానికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమాను సెప్టెంబర్ 2025లో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు బాబీ ఏర్పాట్లు చేస్తున్నాడట. ఈ ప్రాజెక్ట్‌కు సినిమాటోగ్రఫర్‌గా కార్తిక్ ఘట్టమనేని వ్యవహరించనున్నారనే సమాచారం కూడా లభిస్తోంది..ఇక ఈసారి బాబీ, చిరంజీవి కోసం పంచ్ పావర్ ఉన్న కథను రెడీ చేస్తున్నాడా? ఆయన ఈ కాంబోకు మరో సూపర్ హిట్ అందిస్తాడా? అనే ఆసక్తికర ప్రశ్నలు అభిమానుల్లో నెలకొన్నాయి. అధికారిక ప్రకటన ఎప్పుడైనా రావొచ్చు అనే అంచనాలతో మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.