గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రంలో నటిస్తున్నారు. ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ స్పోర్ట్స్ అండ్ ఎమోషనల్ డ్రామా షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేస్తుండగా, బుచ్చిబాబు తర్వాత చరణ్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఇప్పటికే సుకుమార్ ఒక ఇంటెన్స్ స్టోరీ లైన్‌ను చరణ్‌కి వినిపించగా, ఆ కథకి ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం సుకుమార్ తన టీమ్‌తో కలిసి అమెరికాలో ఉండి కథను పూర్తిగా డెవలప్ చేస్తున్నట్లు టాక్. స్పెషల్‌గా అమెరికాలోనే కథా రచన కోసం సిట్టింగ్ ఏర్పాటు చేసి, పలు కీలక అంశాలపై చర్చలు జరుపుతున్నారు
యాక్షన్, ఎమోషన్, సెంటిమెంట్ మేళవించిన సుకుమార్ మార్క్ కథతో ఈ సినిమా ఉండబోతోంది. ప్రతి సినిమాలో ఓ లోతైన భావోద్వేగాన్ని మిళితం చేసే సుకుమార్, ఈ కథలో కూడా అదే పంథాను కొనసాగించనున్నాడు. ఈ ఏడాది చివరికల్లా కథ పూర్తవ్వగా, వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రీ–ప్రొడక్షన్ పనులు ప్రారంభించే యోచనలో ఉన్నారు.మార్చిలో ‘పెద్ది’ విడుదలైన తర్వాత, వెంటనే చరణ్–సుకుమార్ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. రంగస్థలం తర్వాత ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, ఈ ప్రాజెక్ట్‌పై మైత్రి ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది..