గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన కొత్త చిత్రం ‘పెద్ధి’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. స్పోర్ట్స్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ‘దేవర’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్న ఆమె, ఇప్పుడు చరణ్ సరసన స్క్రీన్‌పై అలరించనుంది..ఈ ప్రాజెక్ట్‌ను మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘పుష్ప 2’ తర్వాత మైత్రి మేకర్స్ నుంచి వస్తున్న మరో పాన్ ఇండియా బిగ్ బజ్ మూవీ ఇది.
ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జోరుగా సాగుతోంది. చరణ్ లుక్, అతని పాత్రకు సంబంధించిన ప్రిపరేషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇక తాజా సమాచారం ప్రకారం, ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్‌ను ఆగస్ట్ 25న, వినాయక చవితి స్పెషల్‌గా రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందట. గత చిత్రమైన ‘గేమ్ చేంజర్’లో అప్డేట్స్ ఆలస్యంగా రావడంతో అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. కానీ ఈసారి ‘పెద్ధి’ విషయంలో అలాంటిదేం జరగకుండా చూడాలని చరణ్ కసరత్తులు చేస్తున్నట్టు టాక్.
ఈ సినిమాకు ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. మెగా అభిమానులకి మర్చిపోలేని బ్లాక్‌బస్టర్ ఇవ్వాలనే నమ్మకంతో పటిష్టమైన కథను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, చరణ్ లుక్ ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి…చిత్రంలో శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించగా, చరణ్ ఓ క్రికెటర్‌గాను, ఇతర క్రీడలలో కూడా ప్రావిణ్యం ఉన్న యువ ఆటగాడిగా కనిపించనున్నాడు..ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను 2026 మార్చి 27న, చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు..