‘హనుమాన్’ సినిమా విజయం తర్వాత తేజ సజ్జా నటిస్తున్న తాజా చిత్రం ‘మిరాయ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కె. కరుణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా కాకుండా, సినిమాటోగ్రాఫర్ మరియు స్క్రీన్‌ప్లే రచయితగా కూడా పని చేస్తున్నారు.
ఇటీవల విడుదలైన టీజర్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంది. హై క్వాలిటీ విజువల్స్, ఫాంటసీ యూనివర్స్, అద్భుతమైన కథతో సూపర్ హీరో జోనర్‌కు కొత్త రూపునివ్వనుందని స్పష్టమవుతోంది.
జూలై 26న విడుదల కానున్న ఫస్ట్ సింగిల్ ‘వైబ్ ఉంది..’ సాంగ్‌తో సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ మొదలవుతున్నాయి. టైటిల్, పోస్టర్‌ను బట్టి చూస్తే, ఇది హై ఎనర్జీ టెక్నో బీట్ సాంగ్‌గా అనిపిస్తోంది. తేజ సజ్జా – రితికా నాయక్ మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. గోల్డెన్ ఎనర్జీ స్పార్క్స్ బ్యాక్‌డ్రాప్‌లో మెరిసి, సినిమాకి మైథో-ఫాంటసీ టచ్‌ను హైలైట్ చేస్తోంది..ఈ సినిమాలో మనోజ్ మాంచు పవర్ఫుల్ విలన్‌గా కనిపించనుండగా, శ్రియా శరణ్, జయరామ్, జగపతిబాబు వంటి కీలక నటులు కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.‘మిరాయ్’ సినిమా సెప్టెంబర్ 5న వరల్డ్‌వైడ్‌గా 2D, 3D ఫార్మాట్లలో 8 భాషల్లో థియేటర్లలో విడుదల కాబోతోంది..