Search
Close this search box.

  పెద్దిలో చరణ్ తండ్రిగా శివరాజ్ కుమార్..? బుచ్చిమావా ఏదో గట్టిగా ప్లాన్ చేశాడుగా..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ లో నటిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. నిర్మాతగా వెంకట సతీష్ కిలారు వ్యవహరిస్తున్నారు.. ఐతే ఈ సినిమా నుండి కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ‘పెద్ది’ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది పెద్ది టీమ్..హ్యాపీ బర్త్‌డే కరుణాడ చక్రవర్తి అంటూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్‌లో శివన్న గంభీరంగా, కోపంగా కనిపిస్తూ మాస్ అప్పీల్ కలిగిన లుక్‌లో కనిపించారు.. పెద్ద మీసాలు, చెవికి పోగులు, మెడలో కండువా ఈ యాటిట్యూడ్ చూస్తే సినిమాలో ఆయన పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్టు స్పష్టమవుతోంది..ఐతే పెద్ది సినిమాలో శివాన్న రామ్ చరణ్ తండ్రి గా నటిస్తున్నట్లు సమాచారం..ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.. ఈ సినిమాను బుచ్చిబాబు చాలా జాగ్రత్తగా ప్లాన్ ప్రకారం తెరకేకిస్తున్నాడు.. ఆ మధ్య రిలీజ్ ఐన రామ్ చరణ్ టీజర్ తోనే పెద్ది సినిమా పై భారీ హైప్ పెరిగింది.. అలాగే మీర్జాపూర్ ఫేమ్ మున్నా భాయి లుక్ కూడా సోషల్ మీడియాలో ట్రెండీగా మారింది.. ఈ సినిమా నుండి ప్రతి పాత్ర లుక్ కూడా ట్రెండ్ అవ్వడంతో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా పై భారీ హైప్ ఉంది..‘ఆర్ఆర్ఆర్’ వంటి గ్లోబల్ సక్సెస్ తర్వాత వచ్చిన గేమ్ చేంజర్’ సినిమా అంచనాలకు తగ్గ స్థాయిలో నిలవలేదు. దీంతో అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు. అయితే ‘పెద్ది’పై మాత్రం భారీ అంచనాలు నెలకొన్నాయి..దర్శకుడు బుచ్చిబాబు కథ చాలా కొత్తగా ఉంటుందని, ఇది రామ్ చరణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవబోతుందని అంటున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, లుక్‌లకు మంచి రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా రామ్ చరణ్ గెటప్ ఈ సినిమా స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది.. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు