Search
Close this search box.

  విశ్వంభరలో మాస్ బీట్..! చిరు చిందేయనున్న కన్నడ బ్యూటీ..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భారీ సోషియో-ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ పై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి..వసిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.. ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల సినిమా రిలీజ్ ఆగిపోయింది.. కానీ విశ్వంభర సినిమా నుండి రోజుకు ఒక రూమర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఐతే విశ్వంభర సినిమాలో ఓ మాస్ స్పెషల్ సాంగ్‌ను షూట్ చేసేందుకు యూనిట్ సిద్ధమవుతుందాని సమాచారం.. ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే, ఈ సాంగ్ కోసం మ్యూజిక్ డైరెక్టర్‌గా కీరవాణిని కాకుండా భీమ్స్ సిసిరోలియోను తీసుకున్నారు.. చిరు ఎనర్జీకి తగ్గట్టుగా ఓ పక్కా మాస్ బీట్‌ను భీమ్స్ రెడీ చేశాడట..మరీ ముఖ్యంగా ఈ సాంగ్‌కు చిరుతో స్టెప్పులేసే హీరోయిన్‌గా ఎవరుంటారు అన్నది హాట్ టాపిక్ అయ్యింది.. చాలా మంది పేర్లు వినిపించినా… ఫైనల్‌గా కన్నడ బ్యూటీ నిశ్విక నాయుడు ను సెలెక్ట్ చేసినట్టు సమాచారం..చిరంజీవి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌కి ఉన్న క్రేజ్ వేరే లెవల్. గతంలో ‘ఖైదీ నంబర్ 150’లో రాయ్, ‘వాల్తేర్ వీరయ్య’లో ఊర్వశి రౌతేలా చేసిన స్పెషల్ సాంగ్స్‌కి ఏ రేంజిలో రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే.. ఇప్పుడు ఆ లిస్ట్‌లో నిశ్విక నాయుడు కూడా చేరబోతోందంటే, ఈ పాటపై అంచనాలు ఎలా ఉంటాయో ఊహించచ్చు.. చూడాలి మరి ఈ స్పెషల్ సాంగ్ ఎలా ఉండబోతుందో.. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తుంది.. ఈ సినిమాను భారీ బడ్జెట్తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు