Search
Close this search box.

  దీపికా పదుకొనేకు సందీప్ రెడ్డి వంగ స్ట్రాంగ్ కౌంటర్..!

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో బాలీవుడ్‌లో భారీ పాపులారిటీ సంపాదించిన ఈమె, నార్త్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకంతో ఉన్న ప్రముఖ హీరోయిన్ గా చలామణి అవుతోంది. ఆ క్రేజ్ తోనే, 2022లో ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898ఏడి’ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రంతో తెలుగులో అడుగుపెట్టింది. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మైమరిపించింది. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన తరువాత, మరోసారి తెలుగు సినిమా ‘స్పిరిట్’ లో భాగమైంది. ఈ సినిమాలో కూడా ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు..అయితే, ఈ సినిమాకు సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ విన్న తర్వాత, తనకు ఎక్కువ పారితోషకం, అనేక రిస్ట్రిక్షన్స్ మరియు కొన్ని కారణాల షెడ్యూల్స్ వలన దీపికా ఈ సినిమాను తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీనితో ఆమె పీ.ఆర్. టీమ్ సినిమా విషయంలో స్త్రీ సింపథీని పెంచే ప్రయత్నం చేసింది. దాంతో, ఈ వార్తలతో పాటు, సందీప్ రెడ్డి వంగ గతంలో ఆమె పై చేసిన విమర్శలు పట్ల అభిమానులు తీవ్ర స్పందన వ్యక్తం చేశారు…సందీప్ రెడ్డి వంగ తన ఎక్స్ ఖాతాలో ఇచ్చిన పోస్ట్ ద్వారా దీపికా పై నేరుగా విమర్శలు గుప్పించారు..”మీరు కథ విన్నప్పుడు నేను ఎప్పుడూ నటుడిపై 100% నమ్మకంతో ఉంటాను. కానీ మీరు ఇలా చేయడం వల్ల మీ వ్యక్తిత్వం బయటకు వస్తుంది. చిన్న పాత్ర అని భావించి మీరు సినిమా నుంచి తప్పుకున్నారా? ఇది మిమ్మల్ని అసలు పరిచయం చేసే రీతిగా మారుతోంది. ఒక చిత్ర నిర్మాతగా నా కష్టంతో కూడిన కళలో మీరు నమ్మకాన్ని కోల్పోయారు. మీరు ఆ నమ్మకాన్ని తిరిగి పొందలేరు,” అని ఆయన పేర్కొన్నారు…”డర్టీ పి.ఆర్. గేమ్స్.. ఈ ఆడుకోవడం నాకు సరదా ఇస్తుంది,” అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు..

 

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు