దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబొలో పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ రూ.1500 కోట్ల భారీ బడ్జెట్‌తో దీన్ని నిర్మిస్తున్నారు. అటవీ నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి విజయేంద్రప్రసాద్ కథ, దేవా కట్టా సంభాషణలు అందిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక రాజమౌళి మూవీలో నటీనటుల ఎంపిక అంటే మామూలు విషయం కాదు. ఆయన కథకు తగ్గ వారి కోసం జక్కన్న ఏంతైనా కష్ట పడతారు. దీంతో ఈ సినిమాలో నటీనటుల గురించి కూడా రోజుకో పేరు వినపడుతుంది.
ఇక ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా నటిస్తుండగా. మరో క్రేజీ రూమర్ వైరల్ అవుతుంది. ఓ కీలక పాత్ర కోసం శ్రద్ధా కపూర్‌ను తీసుకునే ఆలోచనలో టీమ్ ఉందని తెలుస్తోంది. ఆమె పాత్ర కథకు అనుగుణంగా సెకండ్ హాఫ్‌లో వస్తోందని టాక్. మరి ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి. ఏదిఏమైనా పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కనీసం అభిమానుల కోసం అయిన ఎలాంటి అప్‌డేట్‌లు వదలకుండా.. షూటింగ్ శరవేగంగా పూర్తి చేస్తున్నారు జక్కన్న.