Search
Close this search box.

  బన్నీ, అట్లీ సినిమా టైటిల్ ఫిక్స్..?

అల్లు అర్జున్ – అట్లీ మ్యాజిక్ మొదలవుతోంది: ₹600 కోట్ల ‘సూపర్ హీరో’ స్పెషల్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మాస్ మాస్టర్

అట్లీ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమా ఇప్పటికే విపరీతమైన హైప్‌ను సొంతం చేసుకుంది.

సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ ప్యాన్-ఇండియా మూవీకి బడ్జెట్ దాదాపు ₹600 కోట్లు. ఇది ఇండియన్ సినిమాల్లోనే ఒక హై ఎండ్ విజువల్ వండర్ అవుతుందనడంలో సందేహమే లేదు.

మూవీలో స్పెషల్ హైలైట్స్:

అల్లు అర్జున్ ఈ చిత్రంలో మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. కథ సూపర్ హీరో కాన్సెప్ట్ ఆధారంగా ఉండబోతోంది. హాలీవుడ్‌ స్టైల్‌లో, మార్వెల్ – అవెంజర్ రేంజిలో తెరకెక్కనుంది.

గ్రాఫిక్స్ పనుల కోసం  ఇంటర్నేషనల్ VFX సంస్థలు already అంగీకరించాయని సమాచారం.

 

 

ఇప్పటికే  దీపికా పదుకోన్, మృణాళ్ ఠాకూర్, భాగ్యశ్రీ బోర్సే లాంటి టాప్ హీరోయిన్లు onboard అయ్యారు. మిగిలిన ఇద్దరు హీరోయిన్ల కోసం ప్రముఖ నామాలతో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

 

ప్రస్తుతం చిత్రానికి “AA22xA6” అనే వర్కింగ్ టైటిల్ ఉంది. అయితే, రెండు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి ‘సూపర్ హీరో’మరియు ‘ఐకాన్’ ఇప్పటికే ఐకాన్ స్టార్ ఆనే బ్రాండ్ బన్నీకి ఉండటం వల్ల, అదే టైటిల్‌ను ఫిక్స్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.

 

ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. త్వరలోనే గ్రాండ్‌గా షూటింగ్ ప్రారంభం కానుంది. ‘పుష్ప 2’ హవాతో ఇంటర్నేషనల్ క్రేజ్ అందుకున్న బన్నీకి ఇది మరో బిగ్ లెప్త్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

 

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు