దర్శకధీరుడు రాజమౌళి,మహేష్ బాబు కాంబో లో వస్తున్న ssmb 29 సినిమా పై గ్లోబల్ ఆడియన్స్ లో భారీ హైప్ ఉందీ.. ఈ సినిమా నుండి ఏ చిన్న అప్డేట్ వచ్చిన క్షణాల్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుందీ.. ఈ సినిమా నిజంగా మహేష్ బాబు కెరీర్‌లో గేమ్‌చేంజర్ ప్రాజెక్ట్ అవబోతుందని అర్థమవుతుంది… ఈ సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్నట్లు సమాచారం.. ఐతే ఈ సినిమాలో ఓ సీన్ లో మహేష్ బాబు కెరీర్‌లో తొలిసారి షర్ట్ లేకుండా సిక్స్‌ప్యాక్‌తో యాక్షన్ సీన్ చేస్తున్నట్లు సమాచారం.. గతంలో పలువురు డైరెక్టర్లు మహేష్‌ను ఈ రకమైన లుక్‌కి ఒప్పించలేకపోయినా, రాజమౌళి కి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషమే… ఈ న్యూస్ తో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.. ఇక ఈ సీన్‌కి సంబంధించిన ఫస్ట్ లుక్ గానీ, టీజర్ గానీ బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో ఎలాంటి హంగామా జరిగే అవకాశం ఉందో ఊహించుకోవచ్చు.. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తుంది.. పృథ్వీ రాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు..ఈ సినిమాను kl నాయరణమూర్తి 1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు..