Search
Close this search box.

  క్షుద్ర పూజలు.. పసికందు హత్య

కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. స్థానిక జగ్గయ్యచెరువు కాలనీలో క్షుద్ర పూజలు చేసి, ఓ పసికందును హత్య చేసిన సంఘటన వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి

పిఠాపురం పట్టణంలో జగ్గయ్య చెరువు లో ఆరు నెలల పసికందును ఇంటి వద్ద ఉన్న బావిలో పడేసి హత్య చేశారు. అయితే అదే ఇంటిముందు కుంకుమ , పసుపు, నిమ్మకాయలు వేసి పూజ చేసినట్లు ఉంది. తెల్లవారేసరికి తల్లి పక్కన ఉండాల్సిన పసికందు బావిలో శవమై తేలింది. అల్లారి ముద్దుగా చూసుకుంటున్న అపసికందును ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్లుగా భావిస్తున్నారు.అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ సంఘటన జరిగినట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. పిఠాపురం పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. కాకినాడ నుండి క్లూస్ టీం కూడా రప్పిస్తున్నారు. అసలు పసికందును ఎందుకు చంపాల్సి వచ్చిందో అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇంటిముందు క్షుద్ర పూజలు చేసినట్లుగా చూపించి, పథకం ప్రకారమే పసికందును హత్య చేసి ఉంటారని అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పసిపాప తల్లిదండ్రులు శైలజ , సతీష్ ప్రేమ వివాహం చేసుకొని, జగ్గయ్య చెరువు కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరి పుట్టిన పసికందుకు యశ్వంతిని అనే పేరు కూడా పెట్టారు. అల్లారుముద్దుగా చూసుకుంటున్న ఈ పసికందును అంతమొందించాల్సిన అవసరం ఎవరికీ వచ్చినట్లు, అసలు ఈ హత్య వెనుక కారణం ఎవరి అనేది తేలాల్సి ఉంది. పిఠాపురం పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు