Search
Close this search box.

  హరీష్ శంకర్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్..?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ రీసెంట్‌గా “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో వెంకీ మామ ఇండస్ట్రీ హిట్ కొట్టి ఫుల్ జోస్ లో ఉన్నాడు.. డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్ గా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు వెంకీ మామ నెక్స్ట్ చేయబోయే సినిమా గురించి ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.. అందుకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. వెంకీ మామ తన సినిమాను క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్లో చేయబోతున్నట్లు సమాచారం.. రీసెంట్ గా వెంకీ మామకు హరీష్ శంకర్ ఓ కథ చెప్పినట్లు సమాచారం.. ఆ కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట.. ఈ సినిమా కూడా కామెడీ జోనర్ లో రాబోతున్నట్లు తెలుస్తుంది..ఈ సినిమా వెంకీ కెరీర్‌లో 77వ సినిమాగా రాబోతున్నట్లు తెలిసింది. ఈ ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి… ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ పై సురేష్ బాబు నిర్మించనున్నారు అని సమాచారం..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు