ఏపీలో వ్యవసాయ మార్కెట్ కమిటీలను నియమించేందుకు ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. సీఎం చంద్రబాబు దీనిపై కసరత్తు చేస్తున్నారు. ఏప్రిల్ మొదటి వారంలోగా ప్రకటన వెలువడే అవకాశా లున్నాయి. ప్రతి జిల్లా నుంచి నివేదికలు తెప్పించు కుంటున్న అధిష్టానం రిజర్వేషన్ల ఆధారంగా పదవులను భర్తీచేయనుంది. రోస్టర్ విధానంలో ఎస్సీ, ఎన్టీ, బీసీ, ఓసి లకు సమ న్యాయం చేసేలా సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.మహిళలకు కూడా అగ్రి కల్చరల్ మార్కెట్ కమిటీ చైర్మన్లతో పాటు డైరెక్టర్ల పదవులు దక్కనున్నాయి. మొత్తం 222 మార్కెట్ కమిటీలు ఉండగా వీటన్నిటికీ చైర్మన్‌లతో పాటు 15 మంది సభ్యులను ప్రభుత్వం నియమించనుంది. 50 శాతానికి పైగా పదవులు ఎస్సీ, ఎస్టీ బీసీలకు కేటాయించనున్నారు.
