కాకినాడ జిల్లా సామర్లకోట రైల్వే ఇంజినీరింగ్ సెక్షన్ పరిధిలో సామర్లకోట, పిఠాపురం, గొల్లప్రోలు, రావికంపాడు స్టేషన్ల మధ్య సిగ్నలింగ్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఈనెల 24 తేదీన పలు రైళ్లను రద్దయినట్లు స్టేషన్ మాస్టర్ రమేష్ తెలిపారు. ఉదయ్, సింహాద్రి ఎక్స్ ప్రెస్ తాత్కాలికంగా రద్దు చేసినట్లు వెల్లడించారు. గుంటూరు నుంచి విశాఖ వెళ్లే సింహాద్రి ఎక్స్ప్రెస్, కాకినాడ విశాఖ పట్టణం,రాజమండ్రి విశాఖపట్టణం మధ్య నడిచే మరో నాలుగు రైళ్లు సింహాద్రి, ఉదయ్ ఎక్ష్ప్రెస్స్ రైళ్లు ఈనెల 24 తేదీన రెండు వైపులా రద్దు చేశారని, ప్రయాణీకులు ఈ విషయాన్ని గమనించాలని స్టేషన్ మాస్టర్ తెలిపారు.
