అల్లు అర్జున్, రాష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సిరీస్ ఎంతా పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. ఈ సినిమా ఇండియాను సినిమాలో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.. ఈ సినిమా మొదటి పార్ట్ పుష్ప ది రైజ్ తో రాగ, రెండవ పార్ట్ పుష్ప ది రూల్ గా వచ్చింది.. ఐతే పుష్ప సంబంధించి ఇంకో పార్ట్ ఉందని.. సినిమా చివర్లో పుష్ప 3 రాంపేజ్ పేరుతో ఓ పోస్టర్ తో పోస్టర్ చిన్న సస్పెన్స్ కూడా ఉంచారు దర్శకుడు సుకుమార్..
ఐతే పుష్ప 3 కి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ ను నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ రీవీల్ చేసింది..
పుష్ప 3 సినిమా 2028లో వస్తుందని మైత్రీ నిర్మాణ సంస్థ భాగస్వామి రవిశంకర్ వెల్లడించడం, అది ఇప్పుడు ఆసక్తి కలిగించిన విషయం. కానీ, ఇది సాధ్యమా అన్నది అనుమానంగా ఉంది. పుష్ప 1 మరియు పుష్ప 2 సినిమాలకు భారీ సమయం తీసుకున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ ప్రస్తుతం కొత్త సినిమా స్టార్ట్ చేయలేదు, కానీ అతను అట్లీ దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి…ఈ సినిమా కనీసం 2026 లో వస్తుంది.
ఇక త్రివిక్రమ్,అల్లుఆర్జున్ కాంబినేషన్ లో చేసే భారీ మైథలాజికల్ సినిమా, మేకింగ్ కు కనీసం రెండేళ్ల సమయం తీసుకుంటుంది. ఈ సినిమా 2028 నాటికి రాబోతుంది. అంటే, పుష్ప 3 సినిమా 2029 లేదా 2030 నాటికి రావడమే సాధ్యమవుతుందని చెప్పవచ్చు.