పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 5 సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా ఉన్నాడు.. ఆ 5 సినిమాలలో ఒక సినిమా ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఫౌజీ.. పీరియాడిక్ వార్ అండ్ లవ్ స్టోరీగా రూపొందుతోన్న సంగతి అందరికీ తెలిసిందే… సీతారామం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.. లవ్ స్టొరీ సినిమాలకు హను రాఘవపూడి స్పెషలిస్ట్ గా అందరూ చెప్పుకుంటారు.. ఐతే ఈ సినిమా గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..ఈ సినిమా కోసం పలు సెలబ్రిటీలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ యువరాణి పాత్రలో కనిపిస్తారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే, ఇప్పుడు కరీనా కపూర్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర కోసం ఎంపిక అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి…
ప్రభాస్ ఈ సినిమాలో ఓ సైనికుడిగా కనిపించబోతున్నాడు. ఇక, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు హను రాఘవపూడి భారీ నటీనటుల ఎంపికతో అంచనాలు భారీగా పెరిగాయి. ఇమాన్వి హీరోయిన్గా నటించనుండగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు…