Search
Close this search box.

  పవన్ కళ్యాణ్ కథతో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వెంకీ మామ..?

విక్టరీ వెంకటేష్ రీసెంట్ గా సంక్రాంతికి రిలీజ్ అయిన

‘సంక్రాంతికి వస్తున్నాం’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఫుల్ జోష్ లో ఉన్నాడు.. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి, రూ. 300 కోట్ల వసూళ్లు రాబట్టింది… ఈ విజయం తర్వాత, వెంకటేష్ తన తదుపరి సినిమా ఎలాంటి జోనర్‌లో చేయబోతున్నాడో అని ఫ్యాన్స్ ఆసక్తి నెలకొంది..

 

అనిల్ రావిపూడి దర్శకత్వంలో కామెడీ ఎంటర్‌టైనర్‌ సినిమాలో వెంకటేష్ నటించాలనుకుంటున్నట్లు అభిమానులు భావించారు. కానీ ఇప్పుడు ఆయన యాక్షన్‌ జోనర్‌లో సినిమా చేయాలనుకుంటున్నట్లు సమాచారం వస్తోంది. వెంకటేష్ కు చాలా మంది దర్శకులు పలు కథలు వినిపించారని, ఆయన తదుపరి సినిమా కోసం వి.వి. వినాయక్‌ మరియు సురేందర్‌ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.

 

వినాయక్, వెంకటేష్‌తో లక్ష్మి సినిమా చేసి, ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌ చేయాలని భావిస్తున్నట్లు వార్తలు ఉన్నాయి. అలాగే, కిక్ దర్శకుడు సురేందర్‌ రెడ్డి కూడా, పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలని అనుకున్నారు. కానీ ఆయనతో సాధ్యం కాకపోవడంతో, అదే కథను వెంకటేష్‌ వద్దకు తీసుకురాగా, వెంకీ నుంచి గ్రీన్ సిగ్నల్‌ వచ్చిందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది..

 

అయితే, ఈ ఇద్దరు దర్శకులతో వెంకటేష్ సినిమా చేస్తాడని వచ్చిన వార్తలు ఆయన అభిమానుల్లో ఆందోళనకు కారణం అయ్యాయి. గతంలో వీరితో చేసిన సినిమాలు సూపర్‌ హిట్లు అయినప్పటికీ, ఇప్పుడు ఈ ఇద్దరు దర్శకులపై ప్రేక్షకుల్లో కొంత నమ్మకం లేకపోవడంతో, వారి సినిమాల మీద ఆశలు తగ్గిపోయాయి… ఇండస్ట్రీలోనూ వీరికి పెద్దగా ఆఫర్లు లేకపోవడంతో, వెంకటేష్‌ అలా వారితో సినిమా చేయడం అనే విషయం అభిమానులను కొంత ఊహించలేకపోతున్నారు..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు