సామర్లకోట పట్టణ ప్రజలు మున్సిపాలిటీకి చెల్లించవలసిన పన్నులు ఈ నెలాఖరులోగా చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ ఏ శ్రీవిద్య అన్నారు. మున్సిపాలిటీలో ఆస్తి పన్ను బకాయిలు చాలా వున్నాయన్నాయాన్నారు.గత సంవత్సరం కేవలం 65శాతం మాత్రమే ఆస్తి పన్నులు వసూలు చేయడం జరిగిందని,రెండేళ్ళ కన్నా ఎక్కువ బకా యిలు ఉన్న సుమారు 350 గృహలకు రెడ్ నోటీసులు జారీ చేశామని,భారీ మొత్తంలో పన్ను బకాయిలున్న వారికి మున్సిపల్ యాక్ట్ ను అనుసరించి కుళాయి తొలగింపు,జప్తు చేసే చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. పట్టణ ప్రజలందరూ పన్నులు మార్చి 31 తేదీలోపు మీ దగ్గరలో వున్న సచివాలయాల్లో కాని, మున్సిపల్ కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ లలో పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి దోహదపడాలని ఈ సందర్బంగా కమిషనర్ కోరారు.
