సామర్లకోట రాక్ సిరమిక్స్ పరిశ్రమలో 54వ జాతీయ భద్రత వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.హెచ్ ఆర్ అడ్మిన్ టి నీరజ్ కుమార్ భద్రత పతాకాన్ని ఎగురవేసి భద్రత వారోత్సవాలని ప్రారంభించారు.ఈ సందర్బం గా ఆయన మాట్లాడుతూ విధుల్లో ఉన్న ప్రతి అధికారి,కార్మికులు భద్రత నియమాలు పాటించడం ద్వార పరిశ్రమ, సమాజ శ్రేయస్సుకు పాటు పడా లని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఇతర ఉన్నతాధికారులు జనరల్ మేనేజర్ రాజిందర్ సింగ్ మాన్, టైల్స్ హెడ్ వాసుదేవ,శానిటరీ వేర్ హెడ్ చెల్లదురై, పర్చేజ్ హెడ్ వెంకటేశ్వర రావు, ఈ హెచ్ ఎస్ మేనేజర్ బాలాజీ, పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్ వి జి ఎస్ కుమార్, ఇతర కంపెనీ అధికారులు, కార్మికులు పాల్గొని భద్రతా ప్రతిజ్ఞ చేశారు.వారం రోజులపాటు కొనసాగే ఈ కార్యక్రమాలలో విద్యార్థుల్లో భద్రతా అవగాహన పెంపొందించేందుకు వేట్లపాలెం జడ్పీపీ హై స్కూల్‌లో పోటీలను నిర్వహించి శానిటరీ వేర్ హెడ్ చెల్ల దురై చేతులు మీదుగా బహుమతులు అందజేశారు.కాగా ఈ ఏడాది “భద్రత మరియు క్షేమం – వికసిత భారత్‌కు కీలకం” అనే నినాదంతో మనం కలిసి ముందుండి,అప్రమత్తంగా ఉండి భద్రతా సంస్కృతిని పెంపొందించా లని హెడ్ హెచ్ ఆర్ అండ్ అడ్మిన్ టి నీరజ్ కుమార్, జనరల్ మేనేజర్ సప్లై చైన్ మానెజ్మెంట్ రాజిందర్ సింగ్ మాన్ ఈ హెచ్ ఎస్ మేనేజర్ బాలాజి లు పిలుపునిచ్చారు
